Breaking News
Loading...

పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దం


రైతుముచ్చట, తెలంగాణ: మార్క్ ఫెడ్ కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సభ్యుల సమావేశం సంధర్భంగా యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని, పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇందుకోసం అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని, మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ. 6300 ఇస్తున్నామని, మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కూడా కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందని, నిన్ననే నాఫెడ్ సంస్థ నుండి రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించిన లిఖితపూర్వక హామీ వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

Post a Comment

1 Comments

  1. మేలైన విత్తన రకాలను కూడా తెలియపరచండి సర్ . ఏ విత్తన రకం సాగు చేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనే వివరాలు కూడా వీలు అయినంత తొందర్లో మాకు తెలియచేయగలరు సర్ .

    ReplyDelete