Breaking News
Loading...

రాపిడ్ పురుగుమందును రైతులెవ్వరూ కొనవద్దు – వ్యవసాయ శాఖ

తెలంగాణ, రైతుముచ్చట: తెలంగాణలో రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ కు చెందిన ఒక ప్రైవేట్ పురుగు మందుల కంపెనీ “రాపిడ్ (ఫిప్రోనీల్ SC 5%)” పేరుతో మార్కెట్ లో విడుదల చేసిన BA/FS/001 పురుగుమందు బ్యాచ్ అమ్మకాలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని వ్యవసాయ శాఖ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది.

కంపెనీ ప్యాకింగ్ ప్రకారం “రాపిడ్” బ్రాండ్ పేరుతో ఉన్న పురుగు మందులో ఫిప్రోనీల్ కెమికల్ సస్పెన్షన్ కాన్సెంట్రేషన్ (SC) 5% ఉండగా, వ్యవసాయ శాఖ నమూనాలు తీసి ల్యాబ్ టెస్ట్ చేసిన తరువాత రాపిడ్ పురుగు మందులో ఫిప్రోనీల్ మోతాదు కేవలం 0.13% మాత్రమే ఉందని తేలింది. దీనితో ఈ పురుగుమందును “మిస్ బ్రాండెడ్ కెమికల్” గా పరిగణించి, ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 ప్రకారం మార్కెట్ లో ఈ బ్యాచ్ అమ్మకాలను తక్షణమే నిలుపుదల చేసి, రైతులు కొనకుండా వివిధ ప్రసార మాద్యమాల ద్వారా అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించడం జరిగింది.

Post a Comment

0 Comments