Breaking News
Loading...

పేద రైతులే చిరుధాన్యాలను పండిస్తారన్న ధోరణి పోవాలి

హైదరాబాద్, రైతుముచ్చట: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు & వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు రాజేంద్రనగర్ లోని జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (IIMR) ను సందర్శించారు. చిరుధాన్యాల సాగు, పరిశోధనలు, వాటి ప్రాముఖ్యత, చిరుధాన్యాల వినియోగం గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంధర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, చిరు ధాన్యాలతోనే పోషక భద్రత ఉంటుందని, పంటల మార్పిడిలో భాగంగా నూనెగింజలతో పాటు చిరుధాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దీనికి అనుగుణంగా చిరుధాన్యాల సాగు వైపు రైతులు దృష్టి సారించాలి, పేద రైతులే చిరుధాన్యలను పండిస్తారన్న ధోరణి పోయి, ప్రతి రైతు తన పొలంలో 10 నుండి 20 శాతం సాగుభూమిని చిరుధాన్యాల సాగుకు కేటాయించాలని అన్నారు.


Post a Comment

0 Comments