Breaking News
Loading...

తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

టి‌ఎస్ & ఏపీ, రైతుముచ్చట: అంచనాల ప్రకారామే సకాలంలో రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికి, వానాకాలం సీజన్ ప్రారంభంలో అడపాదడపా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికి గత రెండు వారాల నుండి వాన దేవుడు మొహం చాటేశాడు. అక్కడక్కడ ఆకాశం మేగావృతం అయ్యి చిరుజల్లులు తప్ప పెద్దగా వర్షాలు కురవడం లేదు. వార్షాధారం క్రింద పంటలు పండించిన రైతులు ఎప్పటి లాగానే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. 

ఈ తరుణంలో రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఇదివరకు అంచనా వేసిన ప్రకారంగానే గురువారం రోజు ఉదయం ఉదయం దక్షిణ కోస్తాంధ్ర తీరప్రాంత పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ద్రోణి ఏర్పడింది. 

ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో 12, 13, 14 తేదీలలో రాయలసీమ అన్ని జిల్లాలలో (చాలాచోట్ల), కోస్తాంధ్ర అన్ని జిల్లాలలో (చాలా చోట్ల), అలాగే దక్షిణ తెలంగాణ (హైదరాబాద్ సహా) మరియు తూర్పు తెలంగాణ జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాంధ్ర తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా ఉత్తర వాయువ్య దిశలో కదిలి జూలై 15 వ తేదీ కల్లా దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర తీరప్రాంతాలలో అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం ప్రభావంతో 15,16,17,18 తేదీలలో కోస్తాంధ్రలోనీ ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

16, 17, 18, 19 తేదీలలో తెలంగాణ అన్ని జిల్లాలలో (ముఖ్యంగా తూర్పు, ఈశాన్య, ఉత్తర జిల్లాలు) చాలాచోట్ల మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments