Breaking News
Loading...

పత్తిలో గులాబీ రంగు పురుగుతో జరజాగ్రత్త

తెలంగాణ, రైతుముచ్చట: రాష్ట్రంలో ఈ సారి పెద్ద మొత్తంలో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు ఉనికిని వ్యవసాయ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ పురుగు ఆశించిన పొలాల్లో అధిక మొత్తంలో దిగుబడులు తగ్గి, పత్తి నాణ్యత దెబ్బతిని, పంట నష్టం 80% వరకు ఉండే అవకాశం కలదు కావున రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలలు పాటించగలరు.

పొలంలో రైతులు గుర్తించవలసిన లక్షణాలు :

గులాబీ రంగు పురుగు ఆశించిన మొగ్గలు, పూలు గడ్డి పూలుగా మారిపోయి రాలిపోవటం జరుగుతుంది

ముదరక ముందే లేత పత్తి కాయలు పక్వానికి వచ్చి తెరుచుకుంటాయి

నివారణకు ఈ క్రింది సస్యరక్షణ చర్యలు చేపట్టాలి :

మొదటగా పురుగు ఉనికిని గుర్తించడానికి ఎకరానికి 6 నుంచి 8 లింగాకర్షక బుట్టలను(ఫిరమోన్ ట్రాప్స్) ఏర్పాటు చేసుకోవాలి

పత్తి చేళ్ళకు దగ్గర్లో, గట్ల పైన బెండ, తుత్తుర బెండ మరియు వెడల్పాటి గడ్డి జాతి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త వహించాలి

విచక్షణ రహితంగా సింథటిక్ పైరిత్రాయిడ్ పురుగు మందులను మరియు 2 నుంచి 3 పురుగుమందుల మిశ్రమాలను పత్తి పంట తొలి దశలో కలిపి వాడరాదు

అనుమతి లేని బయో మందులను ఎట్టి పరిస్థితులలో పిచ్చికారి చేయరాదు

పురుగు ఆశించడాన్ని, అలాగే గుడ్డు దశలను నిర్మూలించడానికి లీటరు నీటికి 5 మి.లీ. (1500 పి.పి.ఎం.) వేప నూనెను పిచీకారి చేసుకోవాలి

ఒక వేల పురుగు ఉదృతి ఎక్కువ అయినట్లయితే ఎకరానికి

300 గ్రాముల థయోడికార్బ్ లేదా

500 మీ.లీ. క్లోరిపైరిపాస్ 20% EC లేదా

400 మీ.లీ ప్రొఫెనొఫాస్ లేదా

400 మీ.లీ. క్వినాల్ ఫాస్ లేదా

200 మీ.లీ. ఫెన్ వల్ రేట్ లేదా

400 మీ.లీ. ఫెన్ ప్రోపత్రిన్ (డానిటాల్) లేదా

200 మీ.లీ. పైపర్మితృన్ ను

200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం సాయంత్రం, వేళల్లో పిచికారి చేసుకోవాలి.

Post a Comment

0 Comments