Breaking News
Loading...

నాణ్యమైన వేరుశనగ ఉత్పత్తికి తెలంగాణ అనుకూలం

హైదరాబాద్, రైతుముచ్చట: తెలంగాణలో వేరుశనగ విస్తీర్ణం, నాణ్యత, దిగుబడుల పెంపు కోసం పరిశోధనపై ఇక్రిశాట్, వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో హైదరాబాద్ లోని మినిష్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో యాసంగి సాగులో వేరుశెనగ ప్రధానపంట కావాలి అని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వేరుశనగ నాణ్యత, దిగుబడి పెరగాలి అని, రూ.9 కోట్ల అంచనాతో ఇక్రిసాట్ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా వేరుశనగ పరిశోధన కొరకై ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసిందని తెలిపారు.

వేరుశెనగ పంట సాగుకు తెలంగాణ నేలలు అనుకూలం అని, గుజరాత్ లో అత్యధికంగా వేరుశెనగ దిగుబడి ఉన్నా అంతర్జాతీయ ఎగుమతులకు సరిపడా నాణ్యత లేదు అని, తెలంగాణ వేరుశెనగ నాణ్యతలో దేశంలో నంబర్ వన్ గా ఉందని ఈ సంధర్భంగా అన్నారు. అంతేకాకుండా త్వరలో వనపర్తిలో వేరుశెనగ పరిశోధన కేంద్రానికి కూడా శంకుస్థాపన చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావువ్యవసాయ విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డాక్టర్ జనీలా, డాక్టర్ అశోక్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments