Breaking News
Loading...

అగ్రో రైతు సేవా కేంద్రాల (ARSK's) నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ


హైదరాబాద్, రైతుముచ్చట: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్టులో అగ్రో రైతుసేవా కేంద్రాల నిర్వహకులకు అగ్రి క్లినిక్ - అగ్రి బిజినెస్ లో మేనేజ్ సంస్థ సహకారంతో తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్న 45 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యాక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు, ఈ కార్యాక్రమానికి అగ్రోస్ ఎండీ రాములు, మేనేజ్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ ఎస్ ఎస్ పండ్,  మేనేజ్ డీజీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా, మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అగ్రో రైతు సేవా కేంద్రాల నిర్వాహకులు వైవిధ్యంగాసృజనాత్మకతతో అగ్రో రైతు సేవ కేంద్రాలను (ARSK) నడిపించాలని, ఒక లక్ష్యం నిర్దేశించుకున్న తర్వాత మానసిక ధైర్యంతో ముందుకుసాగాలని, నిర్వాహకులు పురుగుమందులు, విత్తనాలు, ఎరువుల అమ్మకాలకే పరిమితం కాకుండా, రైతులకు శాస్త్రీయ పరిజ్ఞానం అందించే వేదికలుగా ARSK లు మారాలని సూచించారు. 36 శాతం సబ్సిడీపై నిర్వాహకులకు బ్యాంక్ రుణాలు లభిస్తాయని, ఎంచుకున్న యూనిట్ ను విజయవంతంగా కొనసాగించి ఆర్థికంగా స్థిరపడాలిని అన్నారు.

Post a Comment

0 Comments