Breaking News
Loading...

రైతు భీమాకు రూ 800 కోట్లు విడుదల

తెలంగాణ, రైతుముచ్చట: రైతు భీమా పథకం క్రింద 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం 800 కోట్లు చెల్లించింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో జారీ చేశారు. ప్రస్తుత ప్రీమియం గడువు ఈ నెల 13 వ తేదీతో ముగీయనున్నది. కావున ఆగష్టు 11 లోపు రైతులు తమ ధరఖాస్తును సంబందిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలి. ఈ నెల 14 వ తేదీ నుండి కొత్త ప్రీమియం అమలులోకి రానున్నది. ఈ నేపథ్యంలో రైతుల తరపున LIC కి చెల్లించాల్సిన ప్రీమియం కోసం ప్రభుత్వం ముందస్తుగా 800 కోట్లు విడుదల చేసింది. రైతు భీమా పథకంలో భాగంగా రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, కానీ రైతులపై ఆర్థిక భారం మొపొద్దు అనే ఉద్యెశంతో రైతుల తరపున ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించడం జరుగుతుంది.

Post a Comment

0 Comments