Breaking News
Loading...

నిర్వహణ ఖర్చులతో పాటు రైతులకు ఉచితంగా టేకు మొక్కలు

మధిర, రైతుముచ్చట: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREG) క్రింద వ్యవసాయ శాఖ మరియు EGS శాఖ సమన్వయంతో టేకు మొక్కలను రైతులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.

టేకు మొక్కలను 2 విధాలుగా ఇవ్వడం జరుగుతుంది:

1). వ్యవసాయ క్షేత్రాల చుట్టు గట్లు మీద నాటుకోవడం(బండ్ ప్లాంటేషన్).

2). ఖాళీ స్థలంలో వేసుకోవడం( బ్లాక్ ప్లాంటేషన్)

గట్లు మీద వేసుకోవడానికి ఒక ఎకరానికి గరిష్టంగా 200 మొక్కలు ఇస్తారు.

ఖాళీ స్థలంలో వేసుకోవడానికి ఒక ఎకరానికి గరిష్టంగా 1000 మొక్కలు ఇస్తారు.

SC, ST తరగతి వారికి 10 ఎకరాల లోపు భూమి ఉండాలి.

BC,OC తరగతుల వారికి వారి 5 ఎకరాల లోపు భూమి ఉండాలి.

గుంట తీసి మొక్క వేసినందుకు కూలి ఖర్చు ఒక మొక్కకు 30 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది..

అలాగే మొక్క వేసిన తర్వాత నుండి ఆ మొక్క నిర్వహణ కోసం ఒక నెలకి 5 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు వరుకు మొక్క నిర్వహణ ఖర్చులు ఇవ్వటం జరుగుతుంది.

టేకు మొక్కలు కావలసిన, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ శాఖ అధికారులు & EGS అధికారులను సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత వివరాలను ఇవ్వగలరు.

Post a Comment

0 Comments