Breaking News
Loading...

ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి సలహాలు - సూచనలు

తెలంగాణ, రైతుముచ్చట: రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండటం కోసం పలు వాతావరణాధారమైన సలహాలు, సూచనలతో కూడిన ప్రత్యేక బులిటెన్ ను వ్యవసాయ వాతావరణ పరిశోధన స్థానం, జయశంకర్ అగ్రివర్సిటీ వారు విడుదల చేశారు. 

రాష్ట్రంలో జూన్ నుండి జూలై వరకు 292 మిల్లీ మీటర్లకు గాను 474 మిల్లీ మీటర్ల వర్షాపాతం అనగా 62 శాతం అధిక వర్షాపాతం నమోదయిందని, పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలలో సాదారణ వర్షాపాతం మరియు మిగతా అన్నీ జిల్లాలలో సాదరణం కంటే అధిక వర్షాపాతం నమోదయిందని, గడించిన మూడు రోజుల నుండి కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం వాయువ్య బంగాలఖాతంలో అల్పపీడన ప్రభావం వలన ఈ రోజు మరియు రేపు రాష్ట్రంలోని అన్నీ జిల్లాలలో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల మరియు జగిత్యాలలో జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే సూచనాలున్నాయి. 

కావున రాష్ట్రంలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించవలసిందిగా జయశంకర్ అగ్రివర్సిటీ వారు ప్రత్యేక బులిటెన్ ను విడుదల చేశారు.

బులిటెన్ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి

https://drive.google.com/file/d/1rsiAAwy1xDPjwkN6XbTRFg6h0Mcmg1Ae/view?usp=sharing

Post a Comment

1 Comments