Breaking News
Loading...

సహకార శాఖను బలోపేతం చేసుకుందాం

హైదరాబాద్, రైతుముచ్చట: తెలంగాణ సహకార గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో సహకార శాఖలో DR నుండి SCDR పదోన్నతులు పొందిన అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన సహకార శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య పాల్గోన్నారు.

ఈ సంధర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, సహకార రంగమే ఈ దేశానికి వెన్నెముక అని, అది బలంగా ఉంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని, సహకార శాఖను బలోపేతం చేసుకుందాం అని, సమర్దవంతమయిన అధికారులు సహకార శాఖలో ఉన్నారని, కొన్ని రాష్ట్రాలలో సహకారరంగం బలంగా ఉందని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్దాం అని పిలుపునిచ్చారు.

ప్రభుత్వంలో మంత్రిగా మీ పదోన్నతుల విషయంలో నా బాధ్యతను నిర్వర్తించానని, పదోన్నతుల విషయంలో కొన్ని కోర్టు కేసులు ఉండి, 16 ఏళ్లుగా పదోన్నతులు మీకు లభించకపోవడం బాధాకరం అని, పదోన్నతుల కోసం నియమించిన కమిటీ విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేయడాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు.

Post a Comment

0 Comments