Breaking News
Loading...

జయశంకర్ అగ్రివర్సిటీ & నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం

తెలంగాణ, రైతుముచ్చట: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మద్య నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ క్రింద అవగాహన ఒప్పందం కుదిరింది. జియోస్పెషియల్ టెక్నాలజీని ఉపయోగించి ఎవాపోట్రాన్స్పిరేషన్ & మృత్తిక తేమ శాతాన్ని అంచనా వేయటానికి ఈ ఒప్పందం దోహదపడనున్నది. అదేవిధంగా ఈ రెండు సంస్థలు పరిశోధనలు కొనసాగిస్తూ శాస్త్రవేత్తలకు, రిసర్చ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడనున్నది. ఈ సంధర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రవీణ్ రావు మాట్లాడుతూ, అనతికాలంలోనే దేశంలో టాప్ యూనివర్సీటీల సరసన జయశంకర్ అగ్రివర్సిటీ నిలిచిందని, యూనివర్సిటీ యొక్క వివిధ పంటల వెరైటీలు దేశ రైతాంగాన్ని ఆకర్షించాయని అన్నారు.

Post a Comment

0 Comments