Breaking News
Loading...

సన్న వడ్లు సాగు చేసే దిశగా రైతులను చైతన్య పరచాలి

తెలంగాణ, రైతుముచ్చట: హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత అధికారులతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ పై సమీక్ష నిర్వహించారు. దేశ వాప్తంగా రోజు రోజుకి దొడ్డు వడ్ల వినియోగం తగ్గుతుందని, అందుకే ఎఫ్సీఐ కూడా కొనుగోళ్లను తగ్గించిందని, రైతులు సన్నరకాలనే అధికంగా సాగుచేయాలని, దొడ్డు బియ్యాన్ని వినియోగించే తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు అక్కడే సాగును పెంచుకున్నాయాని, ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితిని గమనించి తెలంగాణ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా సన్న వడ్ల సాగును పెంచే దిశగా చర్యలు తీసుకుంటుందని, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు సన్నవడ్ల సాగు పెంచే దిశగా రైతులను చైతన్యపరచాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనితో పాటు రైతులు పప్పు ధాన్యాలు, పత్తి, నూనెగింజల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగుతో పాటు, ఆలుగడ్డ సాగు, ఆలుగడ్డ సీడ్ విత్తనానికి ఉపయోగపడే సాగును అధికారులు పరిశీలించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, తెలంగాణ విత్తనాభివృధ్ది సంస్థ ఎండీ కేశవులు, అగ్రోస్ ఎండీ రాములు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments