Breaking News
Loading...

వరిలో చీడపీడల బెడద నేపథ్యంలో అలర్ట్ మెసేజ్ జారీ చేసిన ARI, రాజేంద్రనగర్

తెలంగాణ, రైతుముచ్చట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువ శాతం వరి పైర్లు నారుమడి దశ నుండి ప్రధాన పొలంలో పిలకల దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో మాత్రమే చిరుపొట్ట దశలో ఉన్నాయి. వివిధ జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేపథ్యంలో వరి పంటను ఆశిస్తున్న చీడపీడలను దృష్టిలో ఉంచుకొని అలర్ట్ మెసేజ్ ను జారీ చేశారు రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. రఘురామి రెడ్డి.

క్షేత్ర స్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతుల నుండి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నారుమడులలో మరియు ప్రధాన పొలంలో చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయని సమాచారం అందుతుందని, వరి నారుమడులలో కాండం తొలిచే పురుగు మరియు అగ్గితెగులు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగచేస్తున్నాయని. అలాగే ప్రాధాన పొలంలో ముందుగా నాట్లు వేసిన వరి పంట దుబ్బు కట్టే దశలో ఉన్న ప్రాంతాలలో బాక్టీరియా ఎండాకు తెగులు మరియు ఆకుముడత పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుందని. కావున ప్రస్తుతం వివిధ దశలలో ఉన్న వరి పైర్లల్లో తగు యాజమాన్య చర్యలు చేపట్టవలసిందిగా సూచించడం జరిగింది.

ప్రస్తుతం వరి పైర్లను ఆశిస్తున్న చీడపీడల నివారణకు చేపట్టవలసిన యాజమాన్య చర్యల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

https://drive.google.com/file/d/1HCLkbYMbdwBmcbgAJb75P0ZHr_tbq4it/view?usp=sharing

Post a Comment

0 Comments