Breaking News
Loading...

జూలై 31 తో ముగీయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల రిజిష్ట్రేషన్స్ గడువు

హైదరాబాద్, రైతుముచ్చట: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ పారిశ్రామీకీకరణలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అభివృద్ది చేయడంలో భాగంగా ప్రాసెసింగ్, స్టోరేజ్ & మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించి కంపెనీలకు ప్రోత్సహించడానికి 9 జిల్లాలలో SEZ ల మాదిరిగా "స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (SFPZ)" ఏర్పాటుకు గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యంగా వరి, మిర్చి, పసుపు, పప్పు ధాన్యాలు, పండ్లు కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజ్, మార్కెటింగ్ ను దృష్టిలోలో ఉంచుకొని ఒక్కొక్క ఫుడ్ ప్రొసెసింగ్ జోన్ లో కరెంటు, నీటి వసతి, రోడ్లు, డ్రైనేజ్ లాంటి సౌకర్యాలతో కనీసం 225 ఎకరాలలో ఉండే విధంగా రూపకల్పన చేశారు. ధరఖాస్తు చేసుకున్న కంపెనీలకు అర్హతలను బట్టి ఈ జోన్లలో భూమి కేటాయించి కనీస మౌలిక వసతులను కల్పించడం జరుగుతుంది. ఇప్పటివరకు 400 వందలకు పైనే అప్లికేషన్లు రాగా, వీటికి సంబందించిన రిజిష్ట్రేషన్ గడువు జూలై 31 తో ముగీయనున్నది

రిజిష్ట్రేషన్స్ వివరాలు:

వీటి రిజిష్ట్రేషన్స్ ప్రక్రియ తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (TSIIC) వెబ్ సైట్ లో జరుగుతుంది. రిజిష్ట్రేషన్ రుసుము 5000/- కాగా, ఆసక్తి గల వారు తమకు అనుకూలంగా ఉన్న ఎంచుకున్న జిల్లాకు 10 లక్షల చొప్పున ప్రాథమిక అడ్వాన్స్ అమౌంట్ కట్టవలసి ఉంటుంది. రిజిష్ట్రేషన్ తరువాత ఒకవేళ సంబందిత కంపెనీకి అలాట్ మెంట్ జరగపోతే ప్రాథమిక అడ్వాన్స్ అమౌంట్ తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఇందుకోసం రిజిష్ట్రేషన్ సమయంలో కంపెనీ యొక్క అకౌంట్ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది.

రిజిష్ట్రేషన్ లింక్ :

http://cet.cgg.gov.in/tsfpz/ 

Post a Comment

0 Comments