Breaking News
Loading...

మరో 11 వంగడాలను విడుదల చేసిన జయశంకర్ అగ్రీవర్సిటీ


  • అధిక ఉత్పత్తినిచ్చే, చీడ పీడలను తట్టుకునే వంగడాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత
  • ఒక జిల్లా - ఒక పంట పథకంలో భాగంగా మూడు జిల్లాలకు కలిపి 8.4 కోట్లు మంజూరు
  • త్వరలో సోలార్ ప్యానెల్స్ క్రింద కూడా పంటలు పండించే విధానంపై పరిశోధనలు
  • దాదాపు అన్నీ జిల్లాలలో సాయిల్ మ్యాపింగ్ పూర్తి
  • తెలంగాణలో ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలకు అనుమంతి లేదు, ICAR నిబందనలు పాటించాల్సిందే

హైదరాబాద్, రైతుముచ్చట: గత 5 ఏళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామని, దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందామని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ VC వీ. ప్రవీణ్ రావు అన్నారు. గురువారం రోజు హైదరాబాద్ లో వివిధ పంటలలో మరో 11 వంగడాలని విడుదల చేయడం జరిగింది. ఈ సంధర్భంగా జయశంకర్ అగ్రివర్సిటీ VC మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న నీటి పారుదల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో సమర్థవంతమైన నీటి యాజమాన్యం అవసరం అని, అధిక ఉత్పత్తినిచ్చే, చీడ పీడలను తట్టుకునే వంగడాల అభివృద్దికి వ్యవసాయ యూనివర్సిటీ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక పంట పథకంలో భాగంగా వ్యవసాయ యూనివర్సిటీకి మూడు జిల్లాలకు కలిపి 8.4 కోట్లు మంజూరు చేసిందని, సోలార్ ప్యానెల్స్ క్రింద కూడా పంటలు పండించే విధానంపై కూడా రబీ నుంచి పరిశోధనలు మొదలు పెడుతున్నామని తెలిపారు. అదేవిధంగా జయశంకర్ అగ్రివర్సిటీ ఆధ్వర్యంలో అన్నీ జిల్లాలలో సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని, తెలంగాణలో ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజీలకు అనుమంతి లేదు అని స్పష్టం చేశారు. ఏవైనా ప్రైవేట్ యూనివర్సిటీలు అగ్రికల్చర్ కోర్సును ప్రారంభిస్తే ICAR నిబందనలు పాటించాల్సిందే అని అన్నారు. గురువారం రోజు విడుదల చేసిన 11 రకాలలో వరి-5, జొన్న-2, కంది-1, పెసర-1, సోయా చిక్కుడు-1, నువ్వులు-1 ఉన్నాయి.

కొత్తగా విడుదలైన వంగడాల వివరాలు:

వరి (5)
రాజేంద్రనగర్ వరి-1 (RNR 11718)
రాజేంద్రనగర్ వరి-2 (RNR 15435)
కంపాసాగర్ వరి-1 (KPS 2874)
కూనారం వరి-2 (KNM 1638)
వరంగల్ వరి-2 (WGL 962)
జొన్న (2)
తాండూర్ జొన్న-1 (SVT 68)
పాలెం జొన్న-1 (PSV 512)
కంది (1)
వరంగల్ కంది-2 (WRG 255)
పెసర (1)
మధిర పెసర-1 (MGG 385)
సోయా చిక్కుడు (1)
అదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు-1 (AISB 50)
నువ్వులు (1)
జగిత్యాల టిల్ (JCS 2454)

Post a Comment

0 Comments