Breaking News
Loading...

రాష్ట్రంలో క్షీర విప్లవం తీసుకరావాలనే లక్ష్యంగా ఉన్నాం

హైదరాబాద్, రైతుముచ్చట:  తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పశుసంవర్ధక శాఖకు గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యత పెరిగిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పశు గణాభివృద్ధి సంస్థ కార్యవర్గం పదవీకాలాన్ని మరో 2 సంవత్సరాలు పొడగిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపధ్యంలో పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల చైర్మన్ లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ పశుసంవర్ధక శాఖ అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. గొర్రెల పంపిణీ, పాడి గేదెల పంపిణీ, సంచార పశువైద్య శాలల ద్వారా జీవాల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించడం వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మినహాయించి ఏర్పాటు చేసుకున్న నూతన జిల్లాలలో కూడా జిల్లా స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైతులకు మరిన్ని సేవలను అందించడానికి వీలుపడుతుందని అన్నారు. అందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని CEO, చైర్మన్ లను ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, CEO డాక్టర్ మంజువాణి, ఆదిలాబాదు జిల్లా చైర్మన్ గోవర్ధన్ యాదవ్, ఖమ్మం చైర్మన్ నాగేశ్వరరావు, మహబూబ్ నగర్ చైర్మన్ కిషన్ రెడ్డి, మెదక్ చైర్మన్ తిరుపతి, నల్లగొండ చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, రంగారెడ్డి చైర్మన్ నారాయణ రెడ్డి, వరంగల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Post a Comment

0 Comments